అక్షరటుడే, ఎల్లారెడ్డి: నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో కలిసి సదాశివనగర్ మండలం లింగంపల్లి శివారులో వివేక్ బయో ప్రొడక్ట్స్ కంపెనీ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో పరిశ్రమ ఏర్పాటు ద్వారా 250 మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే ఎల్లారెడ్డి పట్టణంలో 300 కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మండలాధ్యక్షులు, కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.