విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

Date:

అక్షరటుడే, ఎల్లారెడ్డి: నియోజకవర్గంలోని అధికారులు, వైద్యులు ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు హెచ్చరించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వోతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించాలన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. సరైన వైద్యం చేయకుంటే ఎవరినైనా ఉపేక్షించేదిలేదని తేల్చి చెప్పారు. ఆయన వెంట ఆర్డీవో ప్రభాకర్‌, ప్రభుత్వ వైద్యాధికారి రవీంద్ర మోహన్‌, కాంగ్రెస్‌ నాయకుడు కురుమ సాయిబాబా తదితరులున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

‘రీయింబర్స్​మెంట్’ విడుదలకు సహకరిస్తా

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిల విడుదలకు తన వంతు...

అనుమానాస్పద వ్యక్తులకు దేహశుద్ధి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: గ్రామాల్లో జాతకాలు చెప్తామంటూ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గ్రామస్థులు...

ఆ ఠాణాకు రావడానికి భయపడుతున్న ఎస్సైలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట పోలీస్​ స్టేషన్​లో​ పోస్టింగ్​ తీసుకోవడానికి ఎస్సైలు ముందుకు...

సోనూసూద్​కు అరెస్టు వారెంట్ జారీ చేసిన కోర్టు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: నటుడు సోనూసూద్​కు పంజాబ్​లోని లూథియానా కోర్టు అరెస్ట్​ వారెంట్​...
error: Content is protected !!