పల్లెల అభివృద్ధికి కృషి చేస్తా..

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ప్రగతిపథంలోకి తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. నాగిరెడ్డిపేట మండలం నియోజకవర్గానికి ప్రధాన వనరుగా ఉంటుందని, పోచారం జలాశయాన్ని త్వరలోనే అభివృద్ధి చేసుకుందామని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు నిధులను తీసుకువచ్చి పల్లెల రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజు దాస్, సర్పంచ్ శ్రీధర్ గౌడ్, జడ్పిటిసి సభ్యుడు మనోహర్ రెడ్డి, తాండూర్ సొసైటీ ఛైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు.