అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడతామని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 3.5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్ట కోసం రూ. 4.5 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఎల్లారెడ్డి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాజేశ్వరి, విద్యాసాగర్, ఆరిఫ్, గయాజుద్దీన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.