Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కొత్తగా చేరిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే ఎక్కువ జనాభా నివసిస్తున్న రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆరుగురు మంత్రులు ఉండేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఒక్క పదవి కేటాయించకపోవడం సరికాదన్నారు.

కులమే అడ్డు వస్తే..

ఇది కూడా చ‌ద‌వండి :  CONGRESS ST CELL | అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం

తనకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక సమీకరణాలు అడ్డు వస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మల్​రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. తాను రాజీనామా చేసి వేరే వారిని గెలిపిస్తానని, వారికైనా మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.

Advertisement