అక్షరటుడే, వెబ్‌డెస్క్: హుజురాబాద్‌లో దళితబంధు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శనివారం ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసే క్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసులకు తోపులాట జరిగింది. కౌశిక్‌రెడ్డిని బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించే క్రమంలో స్పహ తప్పిపడిపోయాడు. ఈసందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తనమీద హత్యాయత్నం చేయిస్తున్నాడని ఆరోపించారు.