అక్షరటుడే, ఆర్మూర్‌: ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వం వసతిగృహాల్లో విద్యార్థులకు కాస్మొటిక్, డైట్‌ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో పట్టణంలోని బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. అనంతరం వసతులు పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ ఛైర్మన్ గంగాధర్, ఎంఈవో రాజగంగారాం, ప్రిన్సిపాల్‌ సృజన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.