అక్షరటుడే, ఇందూరు : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే పశ్రాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన బహిరంగ విచారణకు ఆయన హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలను గుర్తుచేశారు. సొంత పార్టీ ఎమ్మెల్సీనే బాహాటంగా పార్టీ మారిన వ్యక్తులను డిస్‌క్వాలీఫై చేయాలని పేర్కొంటున్నారని, వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్ స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి పాల్గొన్నారు.