అక్షరటుడే, బాన్సువాడ: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మండలంలోని బోర్లంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ సంగ్రామ్ నాయక్, నార్ల సురేష్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.