అక్షరటుడే ,కోటగిరి : పోతంగల్ మండలం జల్లపల్లి గ్రామంలో వ్యవసాయ సలహాదారు ,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.