అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూరు మండలం మల్లాపూర్ కు చెందిన లబ్ధిదారులకు వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హక్కు పత్రాలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన 38 మందికి శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పత్రాలు అందజేశారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, బీర్కూర్ తహశీల్దార్ లత, బోయిని శంకర్, మాజీ ఎంపీపీ తిలకేశ్వరి రఘు, మియాపూర్ శశి, యామ రాములు, కొరిమె రఘు పాల్గొన్నారు.