అక్షరటుడే, కోటగిరి : కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోటగిరిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన కాసుల బాలరాజ్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఏ గ్రేడ్ రకం రూ. 2320, బి గ్రేడ్ రూ. 2300 మద్దతు ధర పొందాలని, ధాన్యం విక్రయించిన వారంలోగా రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ హన్మంతు, సొసైటీ చైర్మన్ కూచి సిద్దు, ఏవో శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.