అక్షరటుడే, బాన్సువాడ : రైతులు ఎవ్వరూ కూడా అధైర్య పడవద్దని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడలోని పోచారం స్వగృహంలో రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైస్ మిల్లర్లకు అలాట్మెంట్ చేసిందని, రైతులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ, బుడ్మి సొసైటీ అధ్యక్షులు కృష్ణా రెడ్డి, గంగారం, మధుసూదన్ రెడ్డి, నాగులగమ వెంకన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Ration Cards | రేషన్​కార్డులపై కీలక అప్​డేట్​.. త్వరలోనే కొత్త కార్డులు