అక్షరటుడే, బాన్సువాడ: ప్రజలు వర్షాలతో ఇబ్బందులు పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని పలు వీధుల్లో సోమవారం ఆయన పర్యటించారు. వంతెనలను పరిశీలించారు. శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, అంజిరెడ్డి, ఎజాజ్, ఉదయ్, నర్సుగొండ, వెంకటేష్, కిరణ్, హకీమ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement