అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLA Raja Singh | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి CM Revanth Reddy ఎమ్మెల్యే రాజాసింగ్ MLA Raja Singh లేఖ రాశారు. శ్రీరామనవమి Sri Ram Navami సందర్భంగా ఏప్రిల్ 6న నిర్వహించనున్న శోభాయాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. 2010 నుంచి తాము శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతియేటా నిర్వహించే ఈ యాత్రలో లక్షల మంది రామభక్తులు పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా.. ఈ సారి యాత్రకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ Hyderabad Police Commissioner స్పందిస్తూ సౌండ్ సిస్టమ్‌ను పరిమితం చేయాలని చెప్పారన్నారు. కానీ ఈ నియమాలు అందరికీ వర్తింపజేయడం లేదంటూ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు అనవసరమైన అడ్డంకులు సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.