అక్షరటుడే, వెబ్డెస్క్ : Cabinet Expansion | మాజీ మంత్రి జానారెడ్డి(Janareddy)పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(Komatireddy Rajagopalreddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి అడుక్కునే స్థితిలో లేనని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి(Minister Post) ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. తనకు పదవి రాకుండా కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా మారారని కీలక వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి 30 ఏళ్లపాటు మంత్రి పదవులు అనుభవించారని, రంగారెడ్డి(Rangareddy), హైదరాబాద్(Hyderabad)కు పదవి విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఇటీవల జానారెడ్డి పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఉగాది తర్వాత జరగాల్సిన మంత్రివర్గ విస్తరణ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. కాగా రాజగోపాల్రెడ్డి ఎప్పటి నుంచో మంత్రి పదవి కాంక్షిస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రయత్నాలు చేశారు. తీరా పదవి వస్తుందనుకున్న తరుణంలో విస్తరణకు బ్రేక్ పడటంతో ఆయన జానారెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. కాగా నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడానికి ఇటీవల ఏఐసీసీ నుంచి ఆమోదం లభించింది. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోరుకుంటుండటంతో మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది.