Rajasingh | ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్టులో ఊరట

Rajasingh | ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్టులో ఊరట
Rajasingh | ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్టులో ఊరట
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Rajasingh | బీజేపీ నేత, గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆయనపై విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘించారని గతంలో మూడు కేసులు నమోదు అయ్యాయి. వీటిని విచారించిన నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు రాజా సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

Rajasingh | బీఆర్​ఎస్​ హయాంలో పీడీ యాక్ట్​

బీఆర్​ఎస్​ హయాంలో ఎమ్మెల్యే రాజాసింగ్​పై పీడీయాక్ట్​ నమోదైంది. హైదరాబాద్​లో స్టాండ్​ అప్​ కమెడియన్​ మునావర్​ షో సందర్భంగా రాజాసింగ్​ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే అప్పుడు ఆ కేసులో ఆయనను అరెస్టు చేసినా కోర్టు రిమాండ్​ ఇవ్వలేదు. దీంతో పోలీసులు గతంలో నమోదైన కేసుల ఆధారంగా పీడీ యాక్ట్​ పెట్టి జైలుకు పంపారు. తాజాగా ఆ కేసుల్లో ఆయనను కోర్టు నిర్దోషిగా తేల్చింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamsagar | అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే