అక్షరటుడే, నిజామాబాద్‌ టౌన్‌: ధాన్యం సేకరణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణతో కలిసి అధికారులతో సమీక్షించారు. రైతులను సొసైటీ సిబ్బంది, రైస్‌మిల్లర్లు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. జిల్లాలో 12వేల వరకు టార్పాలిన్లు ఉన్నాయని, మరిన్ని రానున్నాయన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, డీసీసీబీ చైర్మన్‌ రమేశ్‌ రెడ్డి, డీఎస్‌వో అరవింద్‌ రెడ్డి, డీసీవో శ్రీనివాస్‌, సివిల్‌ సప్లయిస్‌ డీఎం రమేశ్‌, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్‌ హుస్సేన్‌, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.