Advertisement
అక్షరటుడే, బోధన్: పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి గురువారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాదాపు 142 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, తహశీల్దార్ విఠల్, మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మ శరత్ రెడ్డి, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement