అక్షరటుడే, ఇందూరు: బోధన్ నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభానికి రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర వ్యాపారాలతో పాటు రైతు వ్యాపారం కొనసాగితేనే మనుగడ ఉంటుందన్నారు. రైతులు వరితో పాటు ఇతర పంటలపై కూడా దృష్టి సారించాలన్నారు. రైతులు వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు చదవాలని, దాంతో పట్టు పెరుగుతుందన్నారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఐడీసీఎంఎస్ ఛైర్మన్ తారాచంద్, కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం చేసింది వీరే..
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ముప్ప గంగారెడ్డి, వైస్ ఛైర్మన్ గా రాంచందర్, పాలకవర్గ సభ్యులుగా రాజలింగం, బాగారెడ్డి, రాజన్న, మెగావత్ మంగిత్య, గంగారెడ్డి, దేవకర్ణ, ఇంద్రుడు, వెంకటేశ్వరరావు, రఘువీర్, ఎండీ ఈసా, మల్లేశ్, నరేందర్ కుమార్, రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు.