అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : జిల్లాలోని ఆయా చెరువుల్లో చేపపిల్లల విడుదల కోసం ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో మాట్లాడారు. చేపపిల్లల సైజ్‌ తగ్గకుండా పంపాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. నాలుగునెలల్లో మరిన్ని చేపపిల్లల విత్తనాలను తెప్పిస్తామని పేర్కొన్నారు. ఆయా చెరువుల్లో చేపపిల్లలను వదిలేముందు స్థానిక ఆక్వా రైతులకు, నాయకులు, అధికారులకు ముందుగా సమాచారం ఇస్తామన్నారు.