అక్షరటుడే, బిచ్కుంద : మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో బుధవారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు లబ్ధిదారులకు అందజేశారు. జుక్కల్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ ఏర్పాటుపై త్వరలో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. బిచ్కుంద చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు గంగాధర్, రవి పటేల్, విఠల్‌ రెడ్డి, గోపాల్‌ రెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ శంకర్, వెంకట్‌ రెడ్డి, అనిల్‌ పటేల్, తదితరులు పాల్గొన్నారు.