అక్షరటుడే, నిజాంసాగర్: పిట్లం మండలం హస్నాపూర్, నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్ గ్రామాల్లో లబ్ధిదారులకు ఆదివారం ప్రభుత్వ పథకాల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీపతి, ఏఎంసీ ఛైర్మన్ మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement