అక్షరటుడే, మద్నూర్: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును సోమవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కలిశారు. మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొద్ది రోజులుగా సోయా కొనుగోలు కేంద్రం మూతపడడంతో సుమారు ఎనిమిది వేల క్వింటాళ్ల సోయాబీన్ మిగిలిపోయిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మిగిలిపోయిన సోయా పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని తుమ్మల భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Kotapati Narasimhanayudu | వర్సిటీ సలహా కమిటీ సభ్యుడిగా కోటపాటి