అక్షరటుడే, జుక్కల్: పెద్ద కొడప్ గల్ మండలం కాస్లాబాద్, వడ్లం గ్రామాల్లో గోదాంలు, సీసీ రోడ్ల నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు నాణ్యతగా చేపట్టాలని, త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, సొసైటీ ఛైర్మన్ హన్మంత్ రెడ్డి, నాయకులు అహ్మద్, మల్లప్ప పటేల్, నాగిరెడ్డి, మారుతి, ఇందిర, డాక్టర్ సంజీవ్, బస్వరాజ్, సొసైటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement