అక్షరటుడే, జుక్కల్: నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు. జుక్కల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ పరిధిలోని విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణాలు, మరుగుదొడ్లు మరమ్మతులపై చర్చించారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.