అక్షరటుడే, జుక్కల్: నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సూచించారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని, కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ వ్యతిరేక శక్తులు కొందరు ఏకమై పార్టీ ప్రతిష్టను దిగజార్చి పార్టీని చీల్చేందుకు కుట్రలు చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టాలని సూచించారు.