అక్షరటుడే, కామారెడ్డి: బీజేపీ రెండో విడత సభ్యత్వ నమోదు తుది దశకు చేరుకుందని, ఈ మేరకు కార్యకర్తలు లక్ష్యం సాధించేలా పని చేయాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సూచించారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికి తిరిగి బీజేపీ సభ్యత్వం చేయించాలని, వంద మంది ప్రాథమిక సభ్యత్వం చేస్తేనే క్రియాశీల సభ్యత్వానికి అర్హులన్నారు. ప్రతి బూత్ కు వంద చొప్పున సభ్యత్వం తప్పనిసరిగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్, మండలాధ్యక్షుడు భరత్, శ్రీధర్, రమేశ్, రంజిత్, సురేష్, అనిల్ పాల్గొన్నారు.