అక్షరటుడే, కామారెడ్డి: ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ కారుకు 44వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు కారులో వెళ్తుండగా సదాశివనగర్ మండలం గాంధారి ఎక్స్ రోడ్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఎక్స్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్ ఉండడంతో డ్రైవర్ బ్రేక్ వేశాడు. వెనుక నుంచి వచ్చిన లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనుక అద్దం పగలడంతో పాటు స్వల్పంగా ధ్వంసమైంది. అయితే ప్రమాదంలో ఎమ్మెల్యే ఎలాంటి గాయాలు కాలేదు.