అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బెయిల్‌ రావడంపై ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. కవితకు బెయిల్‌ రావడం ఊహించిందేనన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కవడంతోనే బెయిల్‌ వచ్చిందని ఆరోపించారు. చీకటి ఒప్పందాలతో ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు, కేటీఆర్‌ ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారన్నారు. బీజేపీ నేతల కాళ్ల మీదపడి కవితకు బెయిల్‌ తెచ్చుకున్నారంటూ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రజల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించాలన్నారు. కవితకు బెయిల్‌ రావడంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని.. ఇక బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీన ప్రక్రియ మొదలు కానుందంటూ వ్యాఖ్యానించారు.