అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: రాజకీయాల్లో చదువుకున్న మేధావులు, విద్యావేత్తలకు అవకాశం కల్పిస్తే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్‌ఫోర్స్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను గెలిపించాలని కోరారు. విద్యావంతులు ఎన్నికల్లో గెలిస్తే ప్రజల సమస్యలను పరిష్కరించగలరని అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.