అక్షరటుడే, ఆర్మూర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి పోరాడతానని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ అన్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. తాను విద్యావేత్తగా, అధ్యాపకుడిగా, ఉద్యమకారుడుగా పనిచేశానని గుర్తు చేశారు. ఒక విద్యావేత్తగా ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై తనకు అవగాహన ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే తత్వం తనదని చెప్పారు. ఓటరు నమోదు గడువు పొడిగించాలని ఆయన కోరారు. సమావేశంలో నారా వెంకటేష్, విజయ్ కుమార్, బండారి సత్యనారాయణరావు, డాక్టర్ పీవీ నరసింహం, కొలవి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.