అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mlc Results : కరీంనగర్- ఆదిలాబాద్ -మెదక్- నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్లో మంగళవారం రెండో రోజు అధికారులు కౌంటింగ్ చేపడుతున్నారు. మొదటి నుంచి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్‌కు వచ్చే సరికి బీజేపీ లీడ్ 4,494కు పెరిగింది.
మూడో రౌండ్ అనంతరం బీజీపీ అభ్యర్థికి 23,307 ఓట్లు, కాంగ్రెస్‌కు 18,812, బీఎస్పీకి 15,898 ఓట్లు వచ్చాయి. విజేతను ప్రకటించాలంటే 50శాతం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. పోటీ హోరాహోరీగా ఉండటంతో.. మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించడం కష్టం. దీంతో రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించే అవకాశం ఉంది. ఈ లెక్కన విజేత ఎవరనేది తేలేందుకు మరింత సమయం పట్టనుంది.