అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను తనను కలిచివేస్తున్నామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచన వాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. అలాగే విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపుల చట్టంలో లసుగులతో పార్టీ మారుతున్నారని విమర్శించారు. పార్టీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిరాయింపులకు పాల్పడివే వెంటనే వేటు వేయాలని రాహుల్ గాంధీ తెలిపారు. పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిన ఘటన కాంగ్రెస్‌ది అని పేర్కొన్నారు. పార్టీలో ఫిరాయింపులను వ్యతిరేకించానన్నారు. ఎమ్మెల్యే విషయంలోనే కాదు.. బాన్సువాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరికపై మొదట స్పందించానని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో నైతిక విలువలు పాటించాలన్నారు. స్వార్థపూరిత శక్తులు అభివృద్ధిపేరిట పార్టీఫిరాయింపులకు పాల్పడుతున్నాయని ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ దౌర్జన్యాలపై ఎంతో పోరాటం చేశానన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్‌ఎస్ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. గంగారెడ్డిని హత్య చేయడంతో నా కుటుంబ సభ్యుడుని కోల్పోయామన్నారు. తీవ్రమైన మానసిన వేదనలో ఉన్నానని పేర్కొన్నారు.