అక్షరటుడే, వెబ్ డెస్క్: ‘నేను కేసీఆర్ బిడ్డను, ఎలాంటి తప్పు చేయలేదు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాను..’ అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. తీహార్ జైలు నుంచి మంగళవారం రాత్రి విడుదలైన ఆమె మొదటిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. కానీ, వ్యక్తిగతంగా కుటుంబాన్ని వదిలి అయిదున్నర నెలలు జైలులో ఉండడం ఇబ్బందికర విషయమన్నారు. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలి పెట్టనని, అనవసరంగా జైలుకు పంపి తనను ఇంకా మొండిదాన్ని చేశారని కవిత పేర్కొన్నారు.