అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కులగణనను పకడ్బందీగా నిర్వహించాలని, బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిందేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. త్వరలో కులగణన డెడికేటెడ్‌ కమిషన్‌కు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సమగ్ర నివేదిక అందజేస్తామన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం తెలంగాణ జాగృతి ప్రతినిధులతో సమావేశమయ్యారు. కులగణన డెడికేటెడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ బూసాని వెంకటేశ్వర రావును జాగృతి ఆధ్వర్యంలో కలువనున్నామన్నారు. రాష్ట్రంలో కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై కొన్ని నెలల క్రితం జాగృతి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పూర్తి నివేదిక తయారైందన్నారు. బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.