అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరార్శించారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని,అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆమె వెంట టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తనోబా, తదితరులు ఉన్నారు.