Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పాలనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె జగిత్యాలలో మాట్లాడారు. కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని ఎద్దేవా చేశారు. ఓట్లు వేయించుకున్న తర్వాత రేవంత్​రెడ్డి బీసీలను మోసం చేశారన్నారు. బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని డిమాండ్​ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదన్నారు. రాష్ట్రంలో 52 శాతం బీసీలు ఉన్నారని కేసీఆర్​ 2014లోనే చెప్పారని, ప్రస్తుత సీఎం మాత్రం లెక్క తగ్గించి చెబుతున్నారని ఆరోపించారు. కేసీఆర్​ మీద కోపంతో కాళేశ్వరం జలాలు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్​లో చేరారని విమర్శించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Budget | బడ్జెట్​పై ఎన్నో ఆశలు.. ఆ పథకాలకే పెద్దపీట..!