అక్షరటుడే, వెబ్‌డెస్క్: మూసీ నిర్వాసితులపై కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. శాసన మండలిలో మంగళవారం ఆమె మాట్లాడారు. మూసీ నది ప్రక్షాళనకు డీపీఆర్ ఆధారంగానే ఆంచనా ఉంటుందని ప్రభుత్వం ఇప్పటిదాకా చెప్తూ వస్తోందని.. ప్రపంచ బ్యాంక్‌ను రూ.4,100 కోట్లు కావాలని ఆశ్రయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు రూ.14,100 కోట్ల వ్యయం అవుతుందని అనుమతులు, నిధులు ఇప్పించాలని ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్‌రెడ్డి ఏ ప్రాతిపదికన అడిగారో వివరించాలన్నారు. మూసీ పరిసర ప్రాంతాల్లో 309 కుటుంబాలు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోందని, కానీ సోషల్ మీడియాలో వస్తున్న హృదయవిదారక వీడియోలు చూస్తే అది అవాస్తవమని అర్థమవుతోందన్నారు.
Advertisement
Advertisement