అక్షరటుడే, వెబ్​డెస్క్​: అభిమానంతో కేటీఆర్​ ఫొటో పెట్టుకుంటే సామాన్యులను వేధిస్తారా..? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామివారిని కవిత దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement

వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ కృషి..

గతంలో వేములవాడ అభివృద్ధికి కేసీఆర్​ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి రూ.250 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగవద్దని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గుడి చెరువు వద్ద 30 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని, ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరగడం లేదని స్థానికులు చెబుతున్నారన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  MLC Kavitha | కాలభైరవస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు

బీఆర్​ఎస్​ కార్యకర్తలను వేధిస్తున్నారు..

సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వేధింపులు ఎక్కువయ్యాయని, కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు టీ స్టాల్​ను తీసేయించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వానికి ఇంత భేదభావం అవసరం లేదని, తక్షణమే ఇలాంటి కక్షపూరిత చర్యలను మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే చేనేతల జిల్లాగా పేరుందన్నారు. చేనేత కార్మికుల కోసం నాడు మంత్రి కేటీఆర్​ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రస్తుతం ఆ కార్యక్రమాలు నిలిచిపోయి నేతన్నలు అవేదన చెందుతున్నారన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని నియోజకవర్గాలను ప్రభుత్వం సమానంగా చూడాలని కోరారు.

Advertisement