టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌ రెడ్డిని తప్పించాలి

0

అక్షరటుడే, హైదరాబాద్‌: టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఆయనపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాల న్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్‌ రెడ్డిని తీవ్రంగా విమర్శించిన రేవంత్‌ రెడ్డి ఆయన్ను టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమించారన్నారు. రిటైర్డ్‌ అధికారులను కేసీఆర్‌ ఆయా పోస్టుల్లో నియమిస్తే విమర్శలు చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు అదే పనిచేస్తోందన్నారు. విద్యుత్‌ సంస్థలోనూ సభ్యులు, అధికారులుగా ఆంధ్ర వ్యక్తులను నియమించారన్నారు. ఓటుకు నోటు కేసులో వాదించిన న్యాయవాదులను సీఎం అందలమెక్కించారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిలో ఇంకా పచ్చరక్తమే ప్రవహిస్తోందని విమర్శించారు. ఎప్పుడూ జై తెలంగాణ అని అనని రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి, రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం హాస్యాస్పందగా ఉందన్నారు.