సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత “ఎక్స్” వేదికగా డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, దళిత నేత బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా అవలంభిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తోందన్నారు.