ఈడీ కస్టడీకి కవిత..!

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. శనివారం ఉదయం కవితను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వాదోపవాదనల తర్వాత ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 23 వరకు ఈడీ అధికారులు కవితను విచారించనున్నారు. ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి కవితను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె మొబైల్స్ ను ఈడీ సీజ్ చేసింది. తదుపరి విచారణలో మరికొంత మంది బీఆర్ఎస్ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.