అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Kavitha | లింగంపేట ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మండల కేంద్రంలో అంబేడ్కర్ జయంతి Ambedkar Jayanti సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడం వివాదంగా మారింది. దీంతో దళిత సంఘాల సభ్యుల Dalit association members ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కవిత స్పందిస్తూ దళిత సంఘాల నాయకులను పోలీసులు అవమానించారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం Ambedkar Constitution అమలులో ఉందా..? సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy వ్యక్తిగత రూల్ బుక్ అమలులో ఉందా..? అని ప్రశ్నించారు. పోలీసులు police ప్రజాసేవకులుగా వ్యవహరించడంలేదన్నారు. దళిత నాయకులతో Dalit leaders అవమానకరంగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. తక్షణమే సంబంధిత అధికారులను సస్పెండ్ suspended చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదిక పోస్టు చేశారు.