అక్షరటుడే, వెబ్‌డెస్క్: మూసీ ప్రాజెక్ట్ దాని నిధుల గురించి ప్రభుత్వం ఎందుకు గోప్యంగా వ్యవహరిస్తుందో సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. శాసనమండలిలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం మాట్లాడారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌లు) సిద్ధంగా ఉన్నాయని 2024 సెప్టెంబర్ 19న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనను సమర్పించిందన్నారు. కానీ డిసెంబర్ 17న తెలంగాణ అసెంబ్లీలో ఎలాంటి డీపీఆర్ సమర్పించలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రూ.4,100 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అయితే పబ్లిక్ ఫోరంలలో దీనిని పునరుజ్జీవన ప్రాజెక్ట్ అని తప్పుదారి పట్టించారని ఆమె ఆరోపించారు.