అక్షరటుడే, ఇందూరు: ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అని.. అందుకే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆదివారం తొలిసారి కవిత తన సొంత జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ ని ఎదుర్కొనే ధైర్యం లేకనే కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. కావాలని కేటీఆర్, తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. విద్యార్థులు, రైతులు, మైనారిటీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కనీసం గురుకులాలను నడిపించే దమ్ములేని పాలన సాగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 57 మంది, ఉమ్మడి జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, బోధన్ ఇంచార్జ్ ఆయేషా ఫాతిమా, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విట్టల్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Rajiv Yuva Vikasam | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. రాజీవ్​ యువ వికాసం గడువు పెంపు