అక్షరటుడే, వెబ్డెస్క్: నీళ్ల విషయంలో సీఎం రేవంత్రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు – నిజాలు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. కేసీఆర్ను శత్రువు అనుకుంటున్న రేవంత్రెడ్డి.. మన జలాలను తరలిస్తున్న ఆంధ్ర పాలకులు శత్రువులనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. కృష్ణ ట్రిబ్యునల్లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో నీటి వనరుల అభివృద్ధే ధ్యేయంగా పని చేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం జలవనరులను విస్మరిస్తోందని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన చర్యలతో నేడు వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానానికి చేరిందని ఆమె పేర్కొన్నారు.
Advertisement
Advertisement