అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. గైనిక్ సమస్యతో పాటు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించిన జైలు డాక్టర్లు తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. కాసేపటి క్రితం ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్‌లో డాక్టర్లు వైద్య పరీక్షలు పూర్తి చేశారు.