అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ఢిల్లీ లిక్కర్‌స్కాం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత దేశ రాజధాని నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బుధవారం మధ్యాహ్నం వసంత్ విహార్ లోని పార్టీ ఆఫీస్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. ఆమె వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ ఉన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ ‘న్యాయం గెలిచింది.. నా పోరాటం కొనసాగుతుంది.. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందంటూ’ వ్యాఖ్యానించారు. అనంతరం జై తెలంగాణ అంటూ నినదించారు. మధ్యాహ్నం 2.45 గంటలకు విస్తారా ఫ్లైట్ లో హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.