అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బెయిల్‌పై వచ్చిన ఎమ్మెల్సీ కవిత గురువారం మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసానికి చేరుకోగా ఆమెకు దిష్టితీసి స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కన్నబిడ్డను చూడగానే కేసీఆర్‌ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కవిత తన తండ్రితో మాట్లాడారు.